: మోదీ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురిపించిన విదేశీ మీడియా

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలపై విదేశీమీడియా ప్రశంసల వర్షం కురిపించింది. దేశాభివృద్ధి కోసం మోదీ సమర్థవంతంగా పనిచేస్తున్నారని పేర్కొంది. మంచి నిర్ణయాలు తీసుకుంటూ మోదీ ప్రజల మెప్పును పొందుతున్నారని విదేశీ జర్నలిస్టులు కథనాలు రాస్తున్నారు. 86 శాతం కరెన్సీని చలామణీలో లేకుండా చేసి కొత్త నోట్లను తీసుకురావడం అంత సులువేమీకాదని చెప్పింది. 125 కోట్ల జనాభాను దాటిన భారత్‌లో ఆర్థికాభివృద్ధిని కొనసాగించడం తేలికైన విషయం కాదని మోదీ అన్నిటినీ సాధ్యం చేేసే దిశగా కొనసాగుతున్నారని పేర్కొంది. మంచి అభివృద్ధిని సాధిస్తూ భార‌త్ ముందుకు సాగుతోంద‌ని ప్ర‌శంసించింది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటూ మోదీ స‌మ‌ర్థ‌వంతంగా పాల‌న‌ కొన‌సాగిస్తున్నార‌ని చెప్పింది. వ్యాపార అనుకూలతలో గ‌త దేశాల్లో భార‌త్ 50వ ర్యాంక్ సాధించేలా మోదీ స‌ర్కారు 30 రంగాల్లో సంస్కరణలు చేయాల‌ని చూస్తోందని, ఇది మంచి పరిణామమేన‌ని విశ్లేషిస్తున్నారు.

More Telugu News