: 35 వేల అడుగుల ఎత్తులో ఉన్నాం... చర్చకు ఇది సమయం కాదు: పైలట్ హెచ్చరికతో సర్దుకున్న ప్రయాణికులు

'భూమికి 35 వేల అడుగుల ఎత్తులో విమానంలో ఉన్నాం... ఇలాంటి చర్చకు ఇది సమయం కాదు' అన్న పైలట్ హెచ్చరికతో కానీ విమానంలోని ప్రయాణికులు ట్రంప్ మైకం నుంచి బయటకు రాలేకపోయారు. ప్రస్తుతం అమెరికాను పట్టికుదిపేస్తున్న ట్రంప్ విజయంపై ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. అదే చర్చ విమానంలో కూడా మొదలైంది. ఆ వివరాల్లోకి వెళ్తే... యునైటెడ్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం శాన్‌ ఫ్రాన్సిస్కో నుంచి మెక్సికోకి బయల్దేరుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు ఆ విమానంలో ప్రయాణికులు రెండువర్గాలుగా విడిపోవడానికి కారణమయ్యాయి. ఇది తీవ్రం కావడంతో వివాదంగా మారి గందరగోళం నెలకొంది. దీంతో పైలట్ కలుగజేసుకుని, మైక్ లో ప్రయాణికులను ఉద్దేశిస్తూ...'ఎవరి అభిప్రాయాలు వారివి, వాటి గురించి చర్చించే చోటు కాదిది. దయచేసి అంతా ప్రశాంతంగా ఉండండి. మనమంతా భూమికి 35 వేల అడుగుల ఎత్తులో ఉన్నాం. ఇక్కడ రాజకీయాలు చర్చించాల్సిన అవసరం లేదు. ఈ ప్రయాణాన్ని ఆస్వాదిద్దాం' అంటూ ప్రకటన చేయడంతో ప్రయాణికులు సర్దుకున్నారు. ఈ ఘటన అనంతరం ఎవరినీ బలవంతంగా విమానం నుంచి దించేయలేదని, ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారని ఎయిర్ లైన్స్ సంస్థ తెలిపింది.

More Telugu News