: 90 శాతం వరకూ పడిపోయిన మొబైల్స్ అమ్మకాలు... ఐఫోన్ల పరిస్థితి మరింత ఘోరం!

ఇండియాలో పెద్ద నోట్లు రద్దయిన తరవాత, గడచిన వారం రోజుల వ్యవధిలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 90 శాతం తగ్గాయి. ఇక హైఎండ్ ఐఫోన్ విక్రయాల పరిస్థితి మరింత ఘోరంగా మారింది. ఈ వారం రోజుల వ్యవధిలో కనీస స్థాయిలో కూడా ఐఫోన్ల విక్రయాలు సాగలేదు. దీంతో జియోనీ, క్సియోమీ వంటి సంస్థలు కొత్త ఆవిష్కరణలన్నింటినీ వాయిదా వేసుకున్నాయి. రిటైల్ మార్కెట్లో నగదు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమని, కంపెనీలను బట్టి 50 నుంచి 90 శాతానికి పైగా అమ్మకాల కోత నమోదైందని ఢిల్లీలోని నెహ్రూ మార్కెట్ లో మొబైల్ ఫోన్లు విక్రయించే షేక్ హుస్సేన్ అలీ తెలిపాడు. హైఎండ్ ఫోన్ల విక్రయాలు దాదాపుగా నిలిచిపోయాయని అన్నారు. మోదీ ప్రకటన తరువాత ఫోన్లను కొనుగోలు చేసే వారే లేకపోయారని డెహ్రాడూన్ కేంద్రంగా హ్యాండ్ సెట్లను రీటైల్ గా విక్రయిస్తున్న గుల్షన్ అరోరా అనే వ్యాపారి చెప్పాడు. తిరిగి ఇప్పట్లో అమ్మకాలు పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదని, ఈ సంవత్సరం అమ్మకపు టార్గెట్లను సైతం చేరుకునేలా లేమని ఆయన అన్నారు.

More Telugu News