: ట్రంప్ కు అనుకూలంగా వ్యవహరించలేదు: ఫేస్ బుక్

తమ వెబ్ సైట్ లో వచ్చిన తప్పుడు సమాచారం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపుకు దోహదపడిందనే ఆరోపణలను ఫేస్ బుక్ కొట్టిపారేసింది. తాము ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదని స్పష్టం చేసింది. వాస్తవ సమాచారాన్ని తొక్కిపెట్టి, తప్పుడు సమాచారాన్ని ఇవ్వడంలాంటి పనులను ఫేస్ బుక్ చేయదని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. నకిలీ, తప్పుడు వార్తలకు తమ దగ్గర స్థానం లేదని తెలిపారు. గత వారం సీబీఎస్ వార్తా సంస్థతో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, తన విజయానికి ఫేస్ బుక్, ట్విట్టర్లు సహాయపడ్డాయని చెప్పారు. డబ్బు కంటే కూడా సోషల్ మీడియాకే ఎక్కువ శక్తి ఉందనే విషయం తన గెలుపుతో వెల్లడయిందని తెలిపారు. సోషల్ మీడియాలో తనకు 2.8 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారని చెప్పారు.

More Telugu News