: నోట్ల రద్దు నుంచి నేటి వరకు.. మోదీ ఏమన్నారంటే...!

దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, రూ.కోట్ల కొద్దీ పోగేసుకున్న నల్లకుబేరుల భరతం పట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. ఆయన ప్రకటనను సామాన్యులు కూడా స్వాగతించారు. విదేశీ మీడియా సైతం మోదీ నిర్ణయాన్ని ప్రశంసించింది. అయితే దేశంలోని ప్రతిపక్షాలు మాత్రం ప్రధాని నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటయ్యాయి. ఈ నేపథ్యంలో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రకటన నుంచి నేటి వరకు ప్రధాని మోదీ వివిధ సందర్భాల్లో ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రకటనల్లోని ముఖ్యమైన అంశాలు.. * పెద్ద నోట్ల రద్దు తర్వాత కోట్లాది మంది ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయారు. కొందరు అవినీతిపరులు మాత్రం నిద్రమాత్రలు కొనుక్కునేందుకు పరుగులు పెట్టారు. * నాకు తెలుసు. నాకు వ్యతిరేకంగా శక్తులన్నీ ఒక్కటవుతాయని. ఆ శక్తులు నన్ను బతకనీయకపోవచ్చు. నన్ను నాశనం చేసేందుకు కంకణం కట్టుకుని ఉండొచ్చు. 70 ఏళ్లపాటు దేశాన్ని దోచుకున్న వారు ఇప్పుడు కష్టాల్లో పడ్డారు. తదనంతర పరిణామాల కోసం నేను అన్నింటికీ సిద్ధమయ్యా. * 2జీ, బొగ్గు కుంభకోణం వంటివి ఇకముందు జరగబోవు. ఆయా కుంభకోణాల్లో కోట్లాది రూపాయలు దోచుకున్న వారిని కూడా నేడు రూ.4వేల కోసం రోడ్డుపైకి తీసుకొచ్చాం. * నా ఉద్దేశంలో కానీ, నా చర్యల్లో కానీ ఏమైనా తప్పు ఉన్నట్టు మీకు అనిపిస్తే నన్ను బహిరంగంగా ఉరితీయండి. మీరు కోరుకున్న దేశాన్ని మీకు అందిస్తానని హామీ ఇస్తున్నా. * తల్లులను నిర్దాక్షిణ్యంగా ఓల్డేజ్ హోంలలో వదిలేసిన కొడుకులు ఇప్పుడు వారి అకౌంట్లలో రూ.2.5 లక్షలు డిపాజిట్ చేస్తున్నారు. * ఇదో పెద్ద స్వచ్ఛ భారత్ అభియాన్.

More Telugu News