: ఇండో-జపాన్ పౌర అణుఒప్పందంపై చైనా ప్రభుత్వ మీడియాకు భిన్నంగా స్పందించిన విదేశాంగ మంత్రి

ఇండో-జపాన్ పౌర అణుఒప్పందంపై చైనా అధికారికంగా స్పందించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ టోక్యో పర్యటనకు ముందు తమను ఇబ్బంది పెట్టే ఎలాంటి ఒప్పందాలు చేసుకోరాదంటూ చైనా మీడియా హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం భారత్-జపాన్ దేశాలు చేసుకున్న పౌర అణు ఒప్పందంపై చైనా ప్రభుత్వ మీడియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై నేడు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ, అంతర్జాతీయ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి కట్టుబడిన దేశాలకు శాంతియుత అవసరాల కోసం అణుశక్తిని ఉపయోగించుకునే హక్కు ఉంటుందని అన్నారు. అణు సరఫరాదారుల బృందంలో భారతదేశం చేరడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న చైనా, జపాన్-భారత్ అణు ఒప్పందాన్ని వ్యరిరేకించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాగే, దక్షిణ చైనా సముద్రంపై కూడా భారత్-జపాన్ లు స్పందించడంపై ఆయన మాట్లాడుతూ, ఈ విషయంలో చైనా పాతవిధానానికే కట్టుబడి ఉందని తెలిపారు.

More Telugu News