: అమెరికాకు వెళ్తున్న చైనా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది

విద్య కోసం అమెరికాకు వెళుతున్న చైనా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ తన తాజా నివేదికలో... గత ఏడాది అమెరికాకు వెళుతున్న చైనా విద్యార్థుల సంఖ్యలో కేవలం 8 శాతం వృద్ధి మాత్రమే నమోదైందని ప్రకటించింది. గత దశాబ్దకాలంలో అతి తక్కువ వృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారని తెలిపింది. సరిగ్గా దశాబ్దం క్రితం అమెరికా కాలేజీల్లో చైనా విద్యార్థుల సంఖ్య 62 వేలు మాత్రమే ఉండగా, 2015 నాటికి ఈ సంఖ్య 3,28,000లకు చేరింది. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో 31 శాతం మంది విద్యార్థులు చైనీయులే ఉన్నారు. అయితే 2005 నుంచి ఏటా నమోదవుతున్న వృద్ధితో పోలిస్తే... తాజా గణాంకాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో, అక్కడి కాలేజీలు, యూనివర్శిటీలు దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా విద్యార్థులపై దృష్టి సారిస్తున్నాయి.

More Telugu News