: ట్రంప్ కు తొలి కాల్ చేసిన చైనా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ నుంచి చైనా అధ్యక్షుడికి ఫోన్ వెళ్లిందనే వార్తలను... ట్రంప్ కొట్టేసిన సంగతి తెలిసిందే. తాను ఇంతవరకు చైనా అధ్యక్షుడితో తప్ప చాలా మంది దేశాధినేతలతో మాట్లాడానంటూ ట్విట్టర్లో ఆయన తెలిపారు. ఈ క్రమంలో, తాజాగా ట్రంప్ కు చైనా నుంచి తొలి ఫోన్ కాల్ వెళ్లింది. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ట్రంప్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాలు పరస్పర సహకారం అందించుకుంటూ, అభివృద్ధి వైపు అడుగులు వేయాలని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉన్నతికి ఇరు దేశాలు కలసికట్టుగా దోహదపడాలని తెలిపారు. అన్ని రంగాల్లో సహకరించుకోవడం ద్వారా ఇరు దేశాల ప్రజలు లబ్ధి పొందుతారని... ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని ట్రంప్ తో జిన్ పింగ్ అన్నట్టు చైనా మీడియా తెలిపింది. మరోవైపు, ఎన్నికల ప్రచారం సమయంలో చైనాపై ట్రంప్ విమర్శల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. చైనా నుంచి ఇబ్బడిముబ్బడిగా దిగుమతి అవుతున్న వస్తువులపై 45 శాతం పన్ను విధిస్తానని ప్రచారం సందర్భంగా అన్నారు. చైనాపై కరెన్సీ మానిప్యులేటర్ గా ముద్ర వేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడం చైనాను కలవరపరిచే అంశమే.

More Telugu News