: నోట్ల రద్దు నిర్ణయంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన విమర్శ

ఏమాత్రం ముందు జాగ్రత్త, ముందస్తు ప్రణాళిక లేకుండా డీమానిటైజేషన్ పథకాన్ని తీసుకువచ్చారని, కొత్త నోట్ల జారీలో పేలవమైన పనితీరుతో గందరగోళ పరిస్థితి నెలకొందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశాన్ని అయోమయంలోకి నెట్టివేశాయని, దీని వెనుక తమ తప్పు లేదని ఫైనాన్స్ మినిస్ట్రీ వాదించడం క్షమించరాని నేరమని స్వామి తీవ్రంగా మండిపడ్డారు. అవినీతి నిరోధంపై జరుగుతున్న ఓ సెమినార్ లో పాల్గొనేందుకు హాంకాంగ్ వెళ్లిన స్వామి, ఈ వ్యాఖ్యలు చేసినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. ఆర్థిక శాఖ వ్యవహార శైలి తనను బాధించిందని ఆయన అన్నారు.

More Telugu News