: ఇంకాస్త ఊరట... పాత నోట్లు 24 వరకూ చెల్లుబాటు

ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇంకాస్త ఊరట కలిగించేలా పెద్ద నోట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత నోట్ల చెల్లుబాటు తేదీని ఈ నెల 24 వరకూ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పెట్రోలు బంకులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ లు, ఎయిర్ పోర్టుల్లో వీటిని వినియోగించుకోవచ్చని, పౌర సేవల బిల్లులు చెల్లింవచ్చని పేర్కొంది. పాత నోట్లను రద్దు చేసిన తరువాత, వాటి చెల్లుబాటును పొడిగించడం ఇది రెండోసారి. రూ. 500 నోట్లను విడుదల చేసిన తరువాత బ్యాంకులపై కొంత వరకూ ఒత్తిడి తగ్గనుందని నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News