: నల్లకుబేరులకు వీరేంద్ర సెహ్వాగ్‌ చమత్కారంతో కూడిన సలహా!

సామాజిక మాధ్యమాల్లో తనదైన శైలిలో స్పందిస్తోన్న టీమిండియా మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై ట్వీట్ చేశాడు. రద్దు చేసిన పెద్ద నోట్ల‌ను వ‌చ్చేనెల 30 వ‌ర‌కు బ్యాంకుల్లో మార్చుకోవ‌చ్చ‌ని, ఆ తర్వాత వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఆర్‌బీఐలో డిక్లరేషన్ ఫారం ఇచ్చి మార్చుకోవ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది మార్చి 31 తర్వాత కూడా ఐదు బ్యాంకులు నోట్ల‌ను స్వీక‌రిస్తాయ‌ని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఆ ఐదు బ్యాంకులు బ్యాంక్స్ ఆఫ్‌ గంగా, యమునా, సరస్వతీ, నర్మదా, గోదావరి అని ట్వీట్ చేశాడు. కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాక న‌ల్ల‌ధ‌నాన్ని పోగు చేసుకున్న అక్ర‌మార్కులు కొంద‌రు త‌మ డ‌బ్బుని నదుల్లో పారేస్తున్న విష‌యం తెలిసిందే. అందుకే సెహ్వాగ్ అలా చమత్కరించాడు.

More Telugu News