: దుబాయ్ నుంచి వచ్చి కడప పోలీసులకు చిక్కిన ఇంటర్నేషనల్ స్మగ్లర్ అలీఉద్దీన్

శేషాచలం అడవుల్లోని అత్యంత విలువైన ఎర్రచందనం దుంగలను ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ మార్కెట్ కు తరలిస్తూ, పోలీసులకు కునుకు లేకుండా చేసిన అంతర్జాతీయ స్మగ్లర్ అలీఉద్దీన్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. ఓ డీల్ నిమిత్తం దుబాయ్ నుంచి వచ్చిన అలీఉద్దీన్ ను కడప పోలీసులు వలపన్ని అరెస్ట్ చేశారు. అలీతో పాటు అతని ఐదుగురు ముఖ్య అనుచరులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వీరి నుంచి 2 టన్నుల ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని, ఓ కారు, ఆరు సెల్ ఫోన్లు, విదేశీ కరెన్సీని సైతం స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రామకృష్ణ తెలిపారు. దుబాయ్ బడా స్మగ్లర్ సాహుల్ అమీద్ కు అలీఉద్దీన్ ప్రధాన అనుచరుడని ఆయన అన్నారు. ఇక్కడి ఎర్రచందనాన్ని దుబాయ్, చైనా, మలేషియాలకు తరలించిన పలు కేసుల్లో వీరికి ప్రమేయముందని తెలిపారు. కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేయాల్సి వుందని రామకృష్ణ వెల్లడించారు.

More Telugu News