: ప్రజల బ్యాంకు కష్టాలు తీరేందుకు చంద్రబాబు సూచనలు!

తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకుల వద్ద తీవ్ర అవస్థలు పడుతున్న వేళ, ఏపీ సీఎం చంద్రబాబు బ్యాంకు వర్గాలకు పలు సూచనలు చేశారు. రద్దీ నియంత్రణకు పలు మార్గలున్నాయని చెప్పిన ఆయన, టోకెన్ విధానాన్ని అవలంబించాలని, కస్టమర్లకు స్లిప్ లు ఇచ్చి, వారు ఏ సమయానికి బ్యాంకుకు రావాలన్నదీ ఎస్ఎంఎస్ ద్వారా పంపాలని చెప్పారు. ఈ ఉదయం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, పెద్ద నోట్ల రద్దు తరువాత ఏర్పడిన పరిస్థితులపై మాట్లాడారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సి వుందని అన్నారు. డబ్బు చెల్లించలేదని కరెంటు, మంచినీరు వంటి ఎలాంటి సర్వీసులను తొలగించవద్దని ఆయన అధికారులను ఆదేశించారు.

More Telugu News