: హిందువులను ఏమీ అనవద్దు: ముస్లింలకు షేక్ హసీనా విజ్ఞప్తి

బంగ్లాదేశ్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై జరుగుతున్న దాడులు రోజురోజుకూ పెరుగుతుండటంపై ప్రధాని షేక్ హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలు, హిందువులపై దాడులు కూడదని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఉన్న మైనారిటీల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ముస్లింలదేనని ఆమె స్పష్టం చేశారు. దాడుల ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. దాడులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, వారిని చట్టం ముందు నిలిపి కఠిన శిక్షలు పడేలా చూస్తామని హసీనా హెచ్చరించారు.

More Telugu News