: అనుమతి లేకుండా పాదయాత్రలు చేస్తే కఠిన చర్యలు: ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏపీ డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, అనుమతి లేని పాదయాత్రలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తుని సభకు ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని ఆయన గుర్తుచేశారు. పోన్లే కదా అని ప్రభుత్వం సహకరిస్తే, విధ్వంసం సృష్టించారని ఆయన మండిపడ్డారు. పోలీసుల అనుమతి ఉంటేనే ర్యాలీలు, పాదయాత్రలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. కాగా, జిల్లాలోని శ్రీరాంపురంలో పరిశ్రమను వ్యతిరేకిస్తూ స్థానికులు పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే.

More Telugu News