: హైదరాబాద్ ను వణికిస్తున్న చలి... 12 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ లో గత రాత్రి ఉష్ణోగ్రత 12 డిగ్రీలుగా నమోదయింది. మెదక్ లో కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలకు పడిపోయింది. ఖమ్మంలో సాధారణ ఉష్ణోగ్రత కంటే 8 డిగ్రీలు తక్కువగా నమోదయింది. హైదరాబాద్, హన్మకొండ, నల్లగొండ, మెదక్ లలో సాధారణం కంటే 7 డిగ్రీలు తక్కువగా నమోదయింది. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. మరోవైపు పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. హైదరాబాద్ లో పగటి పూట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు కాగా, రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలుగా ఉంది.

More Telugu News