: ఇకపై ‘అచ్చేదిన్’ ఎక్కడా? అని అడిగితే చెప్పుతో కొడతానన్న మంత్రి కుమారుడు!

రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖా మంత్రి గౌరీశంకర్ షేజ్వార్ కుమారుడు ముదిత్ షేజ్వార్ కూడా ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన చేశాడు. తన ఫేస్ బుక్ ఖాతాలో చేసిన ఈ పోస్ట్ చాలా వివాదాస్పదమైంది. అవినీతి నిర్మూలన అంటేనే ‘అచ్చేదిన్’ వచ్చేసినట్లని, ఇకపై ఎవరైనా ‘అచ్చేదిన్’ ఎక్కడా అని అడిగితే చెప్పుతో కొడతానంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే, తన పోస్ట్ నచ్చితే ‘లైక్’ లేకపోతే ‘అన్ లైక్’ చేయండి, అంతేకానీ, రాద్ధాంతం మాత్రం చేయొద్దంటూ పేర్కొన్నాడు. ఈ పోస్ట్ కు లైక్ లతో పాటు విమర్శలూ వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై రాద్ధాంతమూ జరిగింది. అయితే, ఈ పోస్ట్ తన కొడుకు లేయలేదంటూ తండ్రి గౌరీశంకర్ వెనకేసుకొస్తుండటం గమనార్హం.

More Telugu News