: పడిపోయిన పెళ్లి బట్టల వ్యాపారం... ఎవరూ కొనడం లేదని వాపోతున్న వ్యాపారులు

ప్రస్తుతం తెలుగు నాట పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇలాంటి సీజన్ లో కేంద్రం తెచ్చిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కలకలం రేపుతోంది. 500, 1000 రూపాయల నోట్ల రద్దు ప్రభావం వస్త్ర వ్యాపారానికి గుదిబండగా మారిందని వ్యాపారులు చెబుతున్నారు. కేంద్రం నిర్ణయంతో ఒక్కసారిగా వ్యాపారం పడిపోయిందని వారు పేర్కొంటున్నారు. కేవలం 30 శాతం వ్యాపారం మాత్రమే జరుగుతోందని, మిగిలిన 70 శాతం మంది కనీసం బట్టల షాపులవైపు కూడా చూడడం లేదని వారు వెల్లడించారు. ఈ 30 శాతం వ్యాపారం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కొంత మంది వివాహాలు చేసుకునేవారు, అందులో కూడా అతి ముఖ్యులు మాత్రమే బట్టలు కొనుగోలు చేస్తున్నారని వారు తెలిపారు. దీంతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నామని వారు వెల్లడించారు. ఈ దుస్థితి కేవలం తమది మాత్రమే కాదని, అన్ని వ్యాపార రంగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని వారు చెబుతున్నారు.

More Telugu News