: జపాన్ తో కుదిరిన అణు ఒప్పందం

ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో కీలక అణుఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని షింజో అబెతో కలిసి మోదీ మాట్లాడుతూ, ఎన్‌ఎస్జీలో భారత సభ్యత్వానికి మద్దతు తెలిపిన జపాన్‌ కు ధన్యవాదాలు తెలిపారు. జపాన్‌ తో పౌర అణు ఒప్పందం చారిత్రాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు. జపాన్‌ తో పౌర అణు ఒప్పందం కుదుర్చుకున్న తొలి దేశం భారత్‌ అని ఆయన వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ రెండు దేశాలు కలిసి పోరాడుతాయని ప్రధానులిద్దరూ స్పష్టం చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల ఇరుదేశాల్లో శాంతి, సమన్వయం, స్థిరత్వం నెలకొంటాయని వారు ఆకాంక్షించారు. భారత్ కు జపాన్‌ సహజ భాగస్వామ్య దేశమని మోదీ తెలిపారు. పెట్టుబడులు, తయారీ రంగాలకు భారత్‌ ప్రధాన కేంద్రం కావాలన్నదే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News