: ‘స‌క్సెస్’.. ఎస్‌బీఐ వద్ద క్యూలో వెళ్లి పెద్ద‌నోట్లు మార్పించుకొని కొత్త నోట్లు తీసుకున్న రాహుల్ గాంధీ

కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా పెద్ద‌నోట్లను ర‌ద్దు చేస్తూ కొత్త నోట్లను జారీ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ ఈ రోజు ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ లో ఉన్న భార‌తీయ స్టేట్ బ్యాంకు శాఖకు వెళ్లి అక్క‌డ నోట్ల మార్పిడి చేసుకుని అందరినీ ఆశ్చర్య పరిచారు. బారులు తీరిన క్యూలో నిల‌బ‌డిన రాహుల్ గాంధీ పాత నోట్లను మార్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. క్యూలో నిలబడిన రాహుల్.. తాను అక్క‌డ‌కు రూ.4 వేల పాతనోట్ల మార్పిడి కోసం వచ్చానని మీడియాతో చెప్పారు. అనంత‌రం కొద్ది సేపటికి బ్యాంకులోకి వెళ్లి త‌న ద‌గ్గ‌ర ఉన్న‌ రూ.500, రూ.1000 నోట్లను క్యాష్ కౌంట‌ర్‌లో ఇచ్చి కొత్త నోట్ల‌ను తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పలువురు పోటీ ప‌డ్డారు. కౌంట‌ర్ నుంచి క్యాష్ తీసుకుంటున్న స‌మ‌యంలో రాహుల్ ముఖంలో చిరున‌వ్వులు క‌నిపించాయి.

More Telugu News