: మోదీకి మద్దతు ప్రకటించిన ఐఎంఎఫ్... తెలివిగా వ్యవహరించాలని సూచన

నల్లధనంపై యుద్ధం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మద్దతు పలికింది. పెరుగుతున్న అక్రమ లావాదేవీలను అరికట్టడానికి, ఫేక్ కరెన్సీని అంతం చేయడానికి రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేయడాన్ని ఐఎంఎఫ్ స్వాగతించింది. అయితే, అనుకున్నది సాధించే క్రమంలో, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఎలాంటి అంతరాయం లేకుండా, చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని మీడియాతో మాట్లాడుతూ, ఐఎంఎఫ్ ప్రతినిధి గెర్రీ రైస్ తెలిపారు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందన కోరినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు. ఇలాంటి నిర్ణయాలను దేశాలు తరచుగా తీసుకుంటుంటాయని... అయితే చాలా సమర్థవంతంగా దీన్ని నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.

More Telugu News