: విద్యుత్ బిల్లుల చెల్లింపులకు రద్దయిన పెద్దనోట్లు చెల్లుతాయని కేంద్రం ప్రకటించింది: మంత్రి కేటీఆర్

కరెంటు బిల్లుల చెల్లింపులకు రద్దయిన పెద్దనోట్లు తీసుకోవాలన్న వినతికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించి ప్రకటన చేయడంపై మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఢిల్లీలో ఈ రోజు ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానని, కరెంటు చార్జీల చెల్లింపులకు పాత నోట్లను అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరానని చెప్పారు. తద్వారా కరెంటు ఛార్జీలకు సంబంధించిన మొండి బకాయిలు వసూలు కావడంతో పాటు, దేశ వ్యాప్తంగా వినియోగదారుల ఇబ్బందులు తగ్గుతాయని తాను చేసిన సూచనలకు సానుకూలంగా స్పందించిన అరుణ్ జైట్లీ, కేంద్ర విద్యుత్ శాఖాధికారులతో మాట్లాడారన్నారు. ఈ మేరకు వెంటనే స్పందించిన కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయెల్ ఈరోజు సాయంత్రం ఒక ప్రకటన చేశారన్నారు. విద్యుత్ బకాయిల చెల్లింపుల నిమిత్తం ఈ నెల 11వ తేదీ వరకు పాత రూ.500, రూ.1000 నోట్లు చెల్లుబాటు అవుతాయని ప్రకటించారన్నారు.

More Telugu News