: వికెట్లు తీసే బాధ్యత కేవలం అశ్విన్ ది మాత్రమే కాదు... మా ఐదుగురిది: జడేజా

తొలి టెస్టులో విఫలమైన టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ పై విమర్శలకు స్పిన్ సహచరుడు రవీంద్ర జడేజా సమాధానం చెప్పాడు. అశ్విన్ వైఫల్యంపై విమర్శలు గుప్పించడాన్ని జడేజా తప్పుపట్టాడు. జట్టులో మొత్తం ఐదుగురు బౌలర్లమున్నామని చెప్పాడు. ప్రత్యర్థి జట్లు ఆటగాళ్ల వికెట్లు తీసే బాధ్యత అందరికీ ఉందని చెప్పాడు. ప్రత్యర్థుల వికెట్లు తీసే బాధ్యత కేవలం అశ్విన్‌ ది మాత్రమే కాదని స్పష్టం చేశాడు. కొన్ని సార్లు ఆటగాళ్లకు పరిస్థితులు అనుకూలించకపోవచ్చని అన్నాడు. దానిని ఆటలో ఓ భాగంగా చూడాలని హితవు పలికాడు. ప్రత్యర్థుల వికెట్లు తీయడంలో టీమిండియాలోని ప్రతి బౌలర్ కీ సమానమైన భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశాడు. కాగా, రాజ్ కోట్ లో భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలిటెస్టులో పర్యాటక ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 537 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ కాగా, 46 ఓవర్లు వేసిన అశ్విన్ 167 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

More Telugu News