: కొత్త 500 రూపాయల నోటు విశేషాలివే!

తాజాగా స్టోన్‌ గ్రే కలర్ లో విడుదలైన కొత్త 500 రూపాయల నోటుకి పలు విశిష్టతలు వున్నాయి. గతంలో ఆర్బీఐ జారీచేసిన స్పెసిఫైడ్‌ బ్యాంక్‌ నోట్ల (ఎస్బీఎన్‌) సిరీస్‌ కు, తాజా నోటుకు చాలా వ్యత్యాసాన్ని గమనించవచ్చు. ఈ నోట్లు రంగు, పరిమాణం, డిజైన్‌, థీమ్‌, భద్రతాపరమైన ఫీచర్స్‌ ఇలా ప్రతి అంశంలోనూ చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుని సరికొత్త 500 రూపాయల నోటును తీర్చిదిద్దారు. ఈ నోటు వివరాల్లోకి వెళ్తే... * మహాత్మాగాంధీ సిరీస్‌ లో విడుదల చేసిన కొత్త 500 రూపాయల నోట్లపై ‘E’ అనే ఇంగ్లిష్‌ అక్షరంతోపాటు ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ ఆర్‌ పటేల్‌ సంతకం, ముద్రణ సంవత్సరం ‘2016’, స్వచ్ఛ భారత్‌ లోగో, నోటు వెనుకవైపున ముద్రించి ఉంటాయి. * ఈ నోటు వెడల్పు 0.66 మిల్లీమీటర్ల మందం, 150 మిల్లీమీటర్ల పొడవును కలిగి ఉంటాయి. * 500 నోటు రంగు స్టోన్‌ గ్రే (నెరిసిన ముదురు రంగు) * భారత వారసత్వ సంపద అయిన జాతీయ పతాకంతో కూడిన ఎర్రకోట బొమ్మ నోటు వెనుకవైపున ముద్రించి ఉంటుంది. అంధుల కోసం * మహాత్మాగాంధీ బొమ్మ. * అశోక చిహ్నం. * బ్లీడ్‌ లైన్స్‌. * ఐడెంటిఫికేషన్‌ మార్క్స్‌ లను ఉబ్బెత్తుగా ముద్రించారు. దీంతో వీటికి నకిలీలు తయారు చేయడం కష్టమని ఆర్బీఐ అభిప్రాయపడింది.

More Telugu News