: 1000 పెద్దదా? 2000 పెద్దదా?.. మరి కరెన్సీ నోట్లలో ఇదేంటి?

1000 పెద్దదా? 2000 పెద్దదా? అని అడిగితే ఆమాత్రం తెలియదా? అని ఎగాదిగా చూస్తారు. ఎందుకంటే విలువ పరంగా వెయ్యి కంటే రెండువేలు ఎప్పుడూ పెద్దదే. అయితే రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసిన వెయ్యి రూపాయల నోటు కంటే ఇప్పుడు విడుదల చేసిన రెండు వేల రూపాయల నోటు పరిమాణం పరంగా చిన్నగా ఉందని వినియోగదారులు చెబుతున్నారు. ఇంతవరకు కరెన్సీల్లో డబ్బు విలువ పెరిగే కొద్ది నోట్ల సైజు కూడా పెరుగుతూ వచ్చింది. ఈ మేరకు నోట్లను ఓసారి పరికిస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ఇదే పధ్ధతిని ముద్రణ విషయంలో 1 రూపాయి నోటు నుంచి 1000 రూపాయల నోటు వరకు ఆర్బీఐ అనుసరించింది. అయితే తాజాగా ఆర్బీఐ తన పంథా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. అందువల్లే రద్దు చేసిన వెయ్యి రూపాయల నోటు కంటే చిన్న సైజులో గులాబీ రంగులో రెండు వేల రూపాయల నోటును తీసుకొచ్చింది.

More Telugu News