: పోస్టాఫీసుల దగ్గర జనం పడిగాపులు... రాని కొత్త క్యాష్

ఈ ఉదయం నుంచి పోస్టాఫీసుల్లో పాత కరెన్సీ స్థానంలో కొత్త కరెన్సీని మార్చుకోవచ్చని కేంద్ర ప్రకటించినప్పటికీ, మధ్యాహ్నం 12 గంటల వరకూ ఏ పోస్టాఫీసుకూ కొత్త రూ. 500, రూ. 2000 నోట్లు చేరలేదు. ఇంకా బ్యాంకులకే పూర్తి స్థాయిలో నోట్ల బట్వాడా పూర్తికాకపోగా, పోస్టాఫీసులకు పంపే ప్రయత్నాలు ఇంకా ప్రారంభం కాలేదని సమాచారం. బ్యాంకుల వద్ద చేరినట్టుగానే, ఈ ఉదయం నుంచి పోస్టాఫీసుల వద్ద కూడా ప్రజలు భారీ ఎత్తున క్యూ కట్టారు. కాసేపట్లో వస్తాయి, ఇంకో గంటలో వస్తాయి అని ఉద్యోగులు చెబుతున్న మాటలు విని, దాదాపు నాలుగు గంటల నుంచి వివిధ పోస్టాఫీసుల వద్ద వందల మంది పడిగాపులు పడుతున్నారు. అయితే, డిపాజిట్లను మాత్రం స్వీకరిస్తున్నామని, కొత్త నోట్లు రాగానే ఖాతాదారులకు ఇస్తామని ఇండియన్ పోస్టల్ అధికారులు వెల్లడించారు.

More Telugu News