: భారత్ మాతో ఆడడం లేదు కనుక నష్టాన్ని మీరు పూడ్చండి: 'ఐసీసీ'కి పీసీబీ మాజీ ఛైర్మన్ విజ్ఞప్తి

కేప్‌ టౌన్‌ లో జరిగిన ఐసీసీ సమావేశం సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ ను కలిసి, టీమిండియా, పాకిస్థాన్‌ తో మ్యాచ్‌ లు ఆడుతుందా? లేదా? అని అడిగానని పీసీబీ మాజీ ఛైర్మన్, ప్రస్తుత ఐసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ హెడ్‌ నజీమ్ సేథి తెలిపారు. కరాచీలో ఆయన మాట్లాడుతూ, తనకు అనురాగ్ ఠాకూర్ సూటిగా సమాధానం చెప్పలేదని అన్నారు. ఆయన స్పందనతో ప్రస్తుత సమయంలో బీసీసీఐ, పీసీబీతో చర్చలకు సుముఖంగా లేనట్లు వ్యక్తమవుతోందని ఆయన పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లుగా పీసీబీ అధిక నష్టాల్లో ఉందని, పాకిస్థాన్‌ జట్టుతో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌ ఆడేందుకు సిద్ధంగా లేదని ఐసీసీ సభ్యులకు తాను చెప్పినట్లు ఆయన వెల్లడించారు. దీనిని భారత్‌ తప్పుగా పరిగణించి పాక్ జట్టుకు మ్యాచ్‌ పాయింట్లు ఇవ్వాలని, అలాగే భారత్ తో జరగని ద్వైపాక్షిక సిరీస్ వల్ల ఏర్పడిన నష్టాన్ని ఐసీసీ భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News