: మెట్రో రైల్వేస్టేషన్లలో పెద్ద నోట్లు చెల్లుతున్నాయ్!

దేశంలో పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు కేంద్రం చేసిన ప్రకటనతో దేశంలోని అన్ని ప్రాంతాల్లో వ్యాపారులు రూ.500, 1000 నోట్లు తీసుకోవడం లేదన్న విషయం తెలిసిందే. అయితే సామాన్యులు ఇబ్బందులు పడకుండా ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లతో పాటు పలు ప్రాంతాల్లో 72 గంటల వరకు అవి చలామణిలో ఉంటాయని కూడా కేంద్రం చెప్పింది. రైల్వేస్టేషన్లలో నోట్లు చలామణిలో ఉంటాయని, కేంద్ర పేర్కొంది కానీ, మెట్రో రైల్వేస్టేషన్ల గురించి ఏ ప్రకటనా చేయలేదు. దీంతో ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఈ రోజు గంద‌ర‌గోళం నెల‌కొంది. మెట్రో రైల్వేస్టేషన్లలో పెద్ద‌ నోట్లు చెల్లవని ఈరోజు ఉదయం అధికారులు పేర్కొన్నారు. దీంతో మెట్రో ద్వారా ప్ర‌యాణాలు చేసే ప్ర‌యాణికులు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డారు. స‌మాచారం అందకున్న‌ ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంతాదాస్ ప్ర‌యాణికుల ఇక్క‌ట్ల‌ గురించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చెప్పారు. దీంతో రానున్న 72 గంటల వరకు మెట్రో స్టేషన్లలో 500, 1000 రూపాయ‌ల నోట్లు చ‌లామ‌ణిలో ఉంటాయ‌ని ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

More Telugu News