: హిల్లరీ క్లింటన్ రేపటి వరకు ఏమీ మాట్లాడబోరు: హిల్లరీ క్యాంపెయిన్ చైర్మన్ జాన్ పొడెస్టా

అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజ‌య ఢంకా మోగించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న విజ‌యం ప‌ట్ల ఆయ‌న మ‌ద్ద‌తుదారులు సంబ‌రాల్లో మునిగిపోతుంటే, మ‌రోవైపు డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి హిల్ల‌రీ క్లింట‌న్ నివాసం నుంచి ఆమె మ‌ద్ద‌తుదారులు బాధతో వెనుదిరిగారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ విజ‌యం సాధించ‌డం ప‌ట్ల‌ స్పందించిన హిల్లరీ క్లింట‌న్ ఫోనులో ట్రంప్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన‌ప్ప‌టికీ, ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చి మీడియా ముందు మాట్లాడ‌లేని ప‌రిస్థితిలో ప‌డ్డార‌ట‌. హిల్ల‌రీ క్లింట‌న్ క్యాంపెయిన్ చైర్మన్ జాన్ పొడెస్టా మాన్హాటన్లోని జవిట్స్ సెంటర్లో మీడియాతో మాట్లాడుతూ... హిల్లరీ ఈ రాత్రికి ఏమీ మాట్లాడరని ప్ర‌క‌టించారు. ఇక ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆమె నివాసం వ‌ద్ద ఉన్న మ‌ద్ద‌తుదారుల‌కు చెప్పారు. రేప‌టి వ‌ర‌కు హిల్లరీ క్లింటన్ ఎలాంటి కామెంట్ను చేయ‌బోర‌ని స్ప‌ష్టం చేశారు. హిల్లరీ క్లింట‌న్‌కి మద్దతు తెలిపిన వారంద‌రికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

More Telugu News