: పెద్ద నోట్లు చెల్లని వేళ, ఆకలితో ఉన్న భక్తులకు టీటీడీ అభయం!

తిరుమలలో రూ. 500, రూ. 1000 నోట్లు చెల్లడం లేదంటూ భక్తులు గగ్గోలు పెడుతున్న వేళ, పరిస్థితిని అదుపు చేసేందుకు టీటీడీ రంగంలోకి దిగింది. తిరుమలలో పరిస్థితిని సమీక్షించిన ఈఓ సాంబశివరావు, ప్రజలకు అన్న పానీయాలకు ఎలాంటి ఇబ్బందినీ రానివ్వబోమని హామీ ఇచ్చారు. అన్నదాన సత్రంతో పాటు పలు ప్రాంతాల్లో ఉచిత ఆహారాన్ని అందించే ఏర్పాటు చేశామని, భక్తులు హోటళ్లను ఆశ్రయించి నోట్లు తీసుకోవడం లేదని ఆరోపించే బదులు, ఉచిత ఆహారాన్ని స్వీకరించాలని కోరారు. ఈ సమస్య ఒక్క రోజు మాత్రమే ఉంటుందని, రేపటి నుంచి తిరుమలలోని అన్ని ఏటీఎంలలో కొత్త కరెన్సీలను నింపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. సేవా కౌంటర్లలో సైతం పాత నోట్లను తీసుకోవడం లేదని చెప్పిన ఆయన, భక్తులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.

More Telugu News