: ఎన్నికల ఫలితాలను వీక్షించేందుకు భారీ స్క్రీన్లు.. చూసేందుకు పోటెత్తుతున్న ప్రజలు

ఎన్నికల ఫలితాలను ప్రజలు వీక్షించేందుకు వీలుగా అమెరికాలోని పెద్దపెద్ద మాల్స్, హోటళ్లు, కూడళ్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. క్షణక్షణానికి మారుతున్న ఫలితాలను కొందరు టీవీల్లో కన్నార్పకుండా చూస్తున్నారు. ఇక వీధుల్లోకి వచ్చిన జనం భారీ తెరలపై ఫలితాలు వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఇంకొన్ని చోట్ల భారతీయ సంప్రదాయ నృత్యాలు జరుగుతున్నాయి. కాగా పోలింగ్ ముగిసి లెక్కింపు జరుగుతోంది. తొలి నుంచి ట్రంప్ కంటే వెనుకంజలో ఉన్న హిల్లరీ క్లింటన్ అనూహ్యంగా పుంజుకున్నారు. పావు గంట క్రితం వరకు 35 ఎలక్టోరల్ ఓట్ల తేడాతో ఉన్న హిల్లరీ తాజా సమాచారం ప్రకారం అనూహ్యంగా ట్రంప్‌ను వెనక్కి నెట్టేశారు. అయితే ఆ తర్వాత కాసేపటికే ట్రంప్ మళ్లీ ఆధిక్యం ప్రదర్శించారు. ఉత్కంఠ రేపుతున్న ఫలితాలు నువ్వా? నేనా? అన్నట్టు సాగుతున్నాయి. మరికొన్ని గంటల్లో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

More Telugu News