: నా పెళ్లి మాత్రం ఇండియాలోనే, రెండు పద్ధతుల్లో వుంటుంది!: స్పష్టం చేసిన నాగ చైతన్య

తన సోదరుడు అఖిల్ వివాహం ఇటలీలోని రోమ్ లో జరుగుతున్నప్పటికీ, తన వివాహం మాత్రం ఇండియాలోనే జరుగుతుందని 'సాహసం శ్వాసగా సాగిపో' హీరో నాగచైతన్య చెప్పాడు. అయితే, అది చెన్నైలో జరుగుతుందా? లేక హైదరాబాద్ లో జరుగుతుందా? అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేనని తెలిపాడు. ఇటు హిందు, అటు క్రిస్టియన్ సంప్రదాయాల్లో అచ్చం 'ఏ మాయ చేశావే'లో లాగా జరగవచ్చని, ముందు చర్చి, తరువాత గుడి అయితే బాగుంటుందని అన్నాడు. పెళ్లయిన తరువాత కూడా మంచి కథ వస్తే, సమంతతో కలసి నటిస్తానని స్పష్టం చేసిన నాగ చైతన్య, తన తాజా చిత్రం ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు వివరించాడు.

More Telugu News