: 500, 1000 నోట్లు కేజీ 12 రూపాయలే!

అక్రమార్కుల వద్ద కట్టలు కట్టలుగా పేరుకుపోయిన నల్లధనం ఇకపై ఏమవుతుంది? ఈ ప్రశ్నకు నెట్టింట సమాధానం దొరుకుతోంది. పెద్ద నోట్లను మార్చుకోలేకుంటే, అవి చిత్తుకాగితాలేనని చెబుతూ జోకుల మీద జోకులు పేలుతున్నాయి. ఈ నోట్ల కట్టలను తీసుకునేందుకు అభ్యంతరం లేదని, అయితే, కిలోల లెక్కన తూచి, కేజీకి 12 రూపాయలు మాత్రమే ఇస్తామని, ఆపై ఇవి పల్లీలు, బఠానీలు అమ్మేవారికి ఉపయోగపడతాయని చెబుతూ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఆపితే, వెంటనే జేబులోంచి 1000 రూపాయల నోటు తీసి ఇవ్వొచ్చని సెటైర్లు పడుతున్నాయి.

More Telugu News