: అవినీతి కబంధ హస్తాల్లో దేశం చిక్కుకుపోయింది: ప్రధాని మోదీ

అవినీతి కబంధ హస్తాల్లో దేశం చిక్కుకుపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. త్రివిధ దళాధిపతులతో భేటీ అనంతరం జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ, ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక వెలుగు రేఖ. ఈ మాట నేను చెప్పటం లేదు, ఐఎంఎఫ్ చెప్పింది. ‘సబ్ కా సాథ్ -సబ్ కా వికాస్’ అన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. నల్లధనం, అవినీతి కబంధ హస్తాల్లో దేశం చిక్కుకుపోయింది. అధికార దుర్వినియోగంతో అనేక మంది భారీ సంపద కూడగట్టారు. నిజాయతీపరులు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సాధారణ పౌరుడు అత్యంత నిజాయతీగా జీవిస్తున్నాడు. అధికారం ఆనుపానులు తెలిసినవాళ్లే అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతి, నల్లధనం, దొంగనోట్లు, ఉగ్రవాదం దేశ వ్యవస్థలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలు దొంగనోట్లతో ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలు రూ.500, రూ.1000 దొంగనోట్లను చెలామణి చేస్తున్నాయి’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

More Telugu News