: హాలీవుడ్ లో నటించాలన్న మోజెందుకో అర్థం కావడం లేదు: నవాజుద్దీన్ సిద్ధిఖీ

హాలీవుడ్ లో నటించాలన్న బాలీవుడ్ నటుల మోజుపై నవాజుద్దీన్ సిద్ధిఖీ అసహనం వ్యక్తం చేశాడు. బాలీవుడ్ లో హాలీవుడ్ కు దీటైన దర్శకులున్నారని తెలిపాడు. అలాగే బాలీవుడ్ సినిమాలు కూడా అంతర్జాతీయ ప్రశంసలందుకుంటున్నాయని, విదేశాల్లో కూడా మంచి వసూళ్లు రాబట్టుకుంటున్నాయని గుర్తు చేశాడు. బాలీవుడ్ లో రూపొందిన ‘రమన్‌ రాఘవ్‌ 2.0’, ‘గ్యాంగ్‌ ఆఫ్‌ వస్సేపూర్‌’, ‘మిస్‌ లవ్లీ’, ‘ది లంచ్‌ బాక్స్‌’ వంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలతోపాటు విదేశాల్లో మంచి వసూళ్లు సాధించాయని గుర్తు చేశాడు. అలాంటప్పుడు హాలీవుడ్ కు వెళ్లాలన్న అత్యుత్సాహం ఎందుకని ప్రశ్నించాడు. మన సినీ పరిశ్రమే హాలీవుడ్ కు దీటుగా ఎదుగుతున్నప్పుడు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటని అన్నాడు.

More Telugu News