: దయచేసి సమస్యను పరిష్కరించండి: ప్రభుత్వాలకు కోహ్లీ విన్నపం

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కేంద్ర, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపం చేశాడు. ఢిల్లీవాసి అయిన కోహ్లీ.. సొంత నగరంలో రోడ్లపైకి రాలేని దుస్థితి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని కోరాడు. ఢిల్లీలో కాలుష్యం కారణంగా జరగాల్సిన రెండు రంజీ మ్యాచ్ లు కూడా రద్దైన విషయాన్ని గుర్తు చేశాడు. ఢిల్లీ వాసుల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశాడు. కాలుష్యం సమస్యకు పరిష్కారం వెతకాలని ప్రభుత్వాలను కోరాడు. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ గా మారిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇంతలోనే ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదం కాలుష్యాన్ని మరింత పెంచింది. దీంతో ఢిల్లీలో వర్షాలు కురిసేలా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మేరకు పలువురు సూచనలు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News