: పవన్ కల్యాణ్ చూపిన బాటలో నడుస్తున్న బన్నీ!

తన మామయ్య పవన్ కల్యాణ్ చూపిన బాటలోనే నడుస్తూ.. చిన్న హీరోలు నటించే చిత్రాలకు తనవంతు ప్రోత్సాహం ఇచ్చేలా కదులుతున్నాడు అల్లు అర్జున్. నితిన్ వంటి యువ నటులతో పాటు సప్తగిరి వంటి కమేడియన్ హీరోగా నటించిన చిత్రాలకు ముఖ్య అతిథిగా హాజరై, ఆ చిత్రాల మార్కెట్ పెరిగేందుకు పవన్ కల్యాణ్ సహకరిస్తున్నట్టుగానే, బన్నీ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. రెండు చిన్న సినిమాల వేడుకలకు ఆయన హాజరు కానున్నాడు. నిఖిల్ హీరోగా రూపొందిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', కమేడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా తెరకెక్కిన 'జయమ్ము నిశ్చయమ్మురా' చిత్రాల పాటల పండగకు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా సందడి చేయనున్నాడు.

More Telugu News