: అమెరికా ఎన్నికల్లో తుది, తాజా సర్వే అంచనా ఫలితాలు.. హిల్లరీకే పట్టం కడతారట!

మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న వేళ, తుది, తాజా సర్వే ఫలితాన్ని రాయిటర్స్, /ఇప్సాస్ స్టేట్ ఆఫ్ ది నేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలిచే అవకాశాలు 90 శాతం వరకూ ఉన్నాయని ప్రకటించింది. హిల్లరీ గెలుపు ఖాయమైపోయినట్టేనని, తన వివాదాస్పద వ్యాఖ్యలు, మహిళలపై గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ట్రంప్ ఓడిపోనున్నారని సర్వే పేర్కొంది. ఓ దశలో పోటీ హోరాహోరీగా రూపాంతరం చెందినప్పటికీ, చివరి దశలో ఎఫ్బీఐ ఇచ్చిన క్లీన్ చిట్ తో హిల్లరీకి ఆధిక్యం మరింతగా పెరిగిందని వెల్లడించింది. ఎలెక్టోరల్ కాలేజీలో 270 ఓట్లు అవసరం కాగా, హిల్లరీకి 303 ఓట్లు రానున్నాయని, తిరుగులేని మెజారిటీతో ఆమె విజయం ఖాయమైందని ప్రకటించింది. కాగా, నేటి సాయంత్రం 5 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం) దాదాపు 15 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న సంగతి తెలిసిందే.

More Telugu News