: స్వదేశంలో శాంసంగ్ కు ఎదురుదెబ్బ

ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు పేలిన ఘటనలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న శాంసంగ్ కంపెనీకి స్వదేశంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడచిన ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా సంస్థ ప్రధాన కార్యాలయాల్లో దక్షిణ కొరియా న్యాయాధికారులు సోదాలు నిర్వహించారు. దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ జ్యున్ హై స్నేహితురాలైన చాయ్ సూన్ సిల్ ఓ అవినీతి కేసులో ఇరుక్కున్న నేపథ్యంలో ఆమె నిర్వహించే కంపెనీకి శాంసంగ్ నుంచి 3.1 మిలియన్ డాలర్లు బదిలీ చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. చాన్ కుమార్తె గుర్రపు స్వారీని నేర్చుకునేందుకు ఈ నిధుల బదిలీ జరిగినట్టు న్యాయ విభాగానికి ఉప్పందింది. ఆపై చాయ్ సూన్ అరెస్ట్ కావడం, ప్రభుత్వంలో అనిశ్చితి, చాయ్ సూన్ తమపై ఒత్తిడి తెస్తున్నారని శాంసంగ్ ఈడీ ఇచ్చిన సాక్ష్యం, తదితరాల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది.

More Telugu News