: 14 నుంచి ఏసీ డబుల్ డెక్కర్ రైలు రద్దు.. నష్టాలే కారణం

కాచిగూడ-తిరుపతి, కాచిగూడ-గుంటూరు మధ్య నడుస్తున్న ఏసీ డబుల్ డెక్కర్ రైలును శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 14 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. రైలులో అన్నీ ఏసీ బోగీలు కావడం, చార్జీలు అధికంగా ఉండడం, ప్రయాణ వేళలు అనుకూలంగా లేకపోవడంతో ఈ రైలు ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రయాణికుల ఆదరణ కరవైంది. నష్టాలు క్రమంగా ఎక్కువ కావడంతో రైలును రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. నడుస్తున్న రెండు రూట్లలో డబుల్ డెక్కర్ రైళ్లను రద్దు చేయాలని కోరుతూ కొన్ని నెలల క్రితం అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. వీటిని పరిశీలించిన బోర్డు రైళ్ల రద్దుకు అనుమతి మంజూరు చేసింది.

More Telugu News