: మీకు కండోములు తప్ప మరేమీ కనపడవు: నజీబ్ అదృశ్యంపై విరుచుకుపడ్డ కన్హయ్య కుమార్

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యమైన విషయంలో విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సంచలన విమర్శలు చేశారు. దేశ ద్రోహం ఆరోపణలపై జైల్లో గడిపివచ్చిన కన్హయ్య కుమార్, "జేఎన్యూలో వాడిన కండోములను లెక్కించేంత తెలివితేటలు వారికి ఉన్నాయి. అవే తెలివితేటలను చాలా రోజులుగా అద్శశ్యమైన నజీబ్ ను కనిపెట్టేందుకు మాత్రం చాలట్లేదు" అన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జేఎన్యూలో అల్లర్లు చెలరేగిన వేళ, బీజేపీ ప్రతినిధి జ్ఞానదేవ్ అహూజా మాట్లాడుతూ, "జేఎన్యూలో రోజూ 3 వేల బీరు క్యాన్లు, 2 వేల మద్యం సీసాలు, 10 వేల సిగరెట్ బడ్స్, 4 వేల బీడీలు, 50 వేల ఎముకల ముక్కలు, 2 వేల ఖాళీ చిప్స్ ప్యాకెట్స్, 3 వేల కండోమ్స్, 500 అబార్షన్ ఇంజక్షన్స్ కనిపిస్తాయి" అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా, అక్టోబర్ 14న జేఎన్యూ హాస్టల్ లో గొడవ జరుగగా, ఆపై నజీబ్ అహ్మద్ అదృశ్యమయ్యాడు. అతన్ని ఏబీవీపీ కార్యకర్తలు కొట్టారని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది.

More Telugu News