: చంద్రబాబు హెరిటేజ్ రిటైల్ విభాగాన్ని చేజిక్కించుకున్న ఫ్యూచర్ గ్రూప్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్‌ లోని రిటెయిల్ విభాగాన్ని ఫ్యూచర్ గ్రూప్ దక్కించుకుంది. హెరిటేజ్ రిటెయిల్‌ విభాగంలోని 124 స్టోర్లు తాజా ఒప్పందంతో ఫ్యూచర్ గ్రూప్ సొంతమయ్యాయి. ఒప్పందంలో భాగంగా హెరిటేజ్‌ కు ఫ్యూచర్ గ్రూప్ సంస్థ 3.5 శాతం వాటా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దేశీయ రిటైల్ రంగంలో అగ్రస్థాయి సంస్థ అయిన ఫ్యూచర్ గ్రూప్ కు షాపర్స్ స్టాప్, ఈ-జోన్, బిగ్ బజార్ వంటి టాప్ బ్రాండ్లున్నాయి. అంతే కాకుండా ఫ్యూచర్ గ్రూప్ కు దాదాపు 700కు పైగా స్టోర్స్ ఉన్నాయి. ఈ నేపధ్యంలో హెరిటేజ్ రిటైల్ విభాగాన్ని చేజిక్కించుకుని, మొత్తం స్టోర్ల ద్వారా జరిగే వ్యాపారంలో 3.5 శాతం వాటా ఇవ్వనున్నారా? లేక హెరిటేజ్ నుంచి కొనుగోలు చేసిన 124 స్టోర్స్ ద్వారా జరిగే వ్యాపారంలో 3.5 శాతం వాటా ఇవ్వనున్నారా? అన్నది స్పష్టం కావాల్సి ఉంది. అదే సమయంలో ఈ ఒప్పందంలో ఎంత మొత్తం విలువైనది అన్న వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

More Telugu News