: భారత్ పై భారీ దాడికి లష్కరే తాయిబా కుట్ర

భారత్ పై భారీ దాడులకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా కుట్ర పన్నుతున్నట్టు సమాచారం. లష్కరే తాయిబా అధినేత హఫీజ్ సయీద్ ఈ కుట్రలను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సరిహద్దులో భద్రత కట్టుదిట్టంగా ఉండటంతో భూమార్గం ద్వారా ఉగ్రవాదులు ఇండియాలోకి ప్రవేశించడం కష్టసాధ్యంగా మారడంతో... జలమార్గం ద్వారా భారత్ లోకి ప్రవేశించాలని లష్కర్ భావిస్తోంది. నిక్కి, తావి, బడీతావి నదుల ద్వారా ప్రవేశించాలని ప్లాన్ చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి ఇంఛార్జ్ గా ఇర్ఫాన్ తండేవాలాను హఫీజ్ నియమించినట్టు సమాచారం. ఈ ఆపరేషన్ లో తొమ్మిది మంది వరకు ఉగ్రవాదులు పాల్గొనే అవకాశం ఉంది. జలమార్గంలో ఉగ్రవాదులు ప్రవేశించవచ్చన్న సమాచారంతో... నదులు, ఇతర జలమార్గాలు ఉన్న అన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

More Telugu News