: కమేడియన్ హీరోగా చేయడమంటే లాటరీ కొట్టడమే... ఇంకో లాటరీ వస్తుందనుకోవద్దు: అలీ సలహా

ఓ కమేడియన్ కు హీరోగా అవకాశం రావడమంటే, లాటరీ తగలడమేనని, దాన్నుంచి వచ్చిన పేరు, ప్రతిష్ఠలను జేబులో ఉంచుకుని ముందుకు పోవాలే తప్ప, మరో చాన్స్ తీసుకుందామని భావిస్తే, ఫలితం ఒకేలా ఉండకపోవచ్చని సినీ నటుడు అలీ అన్నాడు. సప్తగిరి నటించిన 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' చిత్రం ఆడియో ఆవిష్కరణ కు వచ్చిన ఆయన సప్తగిరికి ఈ మేరకు సలహా ఇచ్చాడు. గతంలో రాజబాబు, రేలంగి నుంచి మధ్యలో బ్రహ్మానందం, ఇప్పుడు తాను, సునీల్ వరకూ కామెడీ చేస్తూ, హీరోలుగా విజయవంతమైన చిత్రాలను చేశామని గుర్తు చేసుకున్నారు. పూర్తిగా హీరోగానే ఉండిపోయే ఆలోచన వద్దనే విధంగా మాట్లాడాడు.

More Telugu News