: కలసి నడుద్దాం... టెక్ అడుగులేద్దాం: థెరిస్సా మేతో మోదీ

అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఇండియా, బ్రిటన్ దేశాల మధ్య సంబంధం మరింతగా పెరగాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. సాంకేతికాభివృద్ధికి ఇరు దేశాలూ పరస్పర సాయం చేసుకోవాల్సి వుందని అన్నారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో ప్రారంభమైన భారత్‌- బ్రిటన్‌ టెక్నాలజీ సదస్సులో బ్రిటన్‌ ప్రధాని థెరిసా మేతో కలసి మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన మోదీ, ఇండియా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని గుర్తు చేశారు. తమ దేశంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని, బ్రిటన్ నుంచి కూడా పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ మెంట్స్ ఇప్పటికే వచ్చాయని గుర్తు చేశారు. ఇటీవల దీపావళి వేడుకలు లండన్ లో వైభవంగా జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, బ్రిటన్ ప్రధాని యూరప్‌ దాటి తొలిసారి బయటకు వచ్చిన వేళ, తన పర్యటనకు ఇండియాను ఎన్నుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని, అందుకు బ్రిటన్‌ ప్రధానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. సౌరవిద్యుత్‌ రంగంలో ఇరుదేశాలూ కలసి సంయుక్తంగా 10 మిలియన్‌ పౌండ్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మోదీ పేర్కొన్నారు.

More Telugu News