: ఉత్తర కొరియాను బురిడీ కొట్టించి, ఐదు రోజులు సకల మర్యాదలూ పొంది తిరిగొచ్చిన ఆస్ట్రేలియా యువకులు

ఉత్తర కొరియాలోని కఠిన నిబంధనలు, ఆ దేశ అధ్యక్షుడి నియంతృత్వ పాలన గురించి అందరికీ తెలిసిందే. చిన్న నేరానికే కఠిన శిక్షలు ఉండే ఉత్తర కొరియాను ఇద్దరు ఆస్ట్రేలియా యువకులు బురిడీ కొట్టించారు. ఆ దేశంలో ఐదు రోజుల పాటు పూర్తి అతిథి మర్యాదలు స్వీకరించి, ఆపై సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే, ఉత్తర కొరియాలో ప్రతియేటా గోల్ఫ్ పోటీలు జరుగుతాయి. ఈ పోటీలకు ఆస్ట్రేలియా పోలో క్రీడాకారులు మోర్గాన్ రూగ్ం ఇవన్ షే దరఖాస్తు చేసుకోగా, వారిని రమ్మని ఆహ్వానం వచ్చింది. దీంతో తప్పు చేస్తున్నామని తెలిసినా, ధైర్యంగా ఉత్తర కొరియాకు వెళ్లారు. విదేశీయులు ఎవరు ఉత్తర కొరియా వెళ్లినా అక్కడి అధికారులకు పాస్ పోర్టులు ఇవ్వాల్సిందే. అలాగే వీరూ ఇచ్చారు. అయితే, అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడంతో వీరి పాస్ పోర్టుల వెరిఫికేషన్ జరగలేదు. మొత్తం 85 దేశాల క్రీడాకారులు పోటీలకు రాగా, గోల్ఫ్ రాని వీరు ఆటగాళ్ల మాదిరి నటించి స్కోర్ బోర్టులో చివరి స్థానంలో నిలిచారు. ఐదు రోజుల పాటు పలు ప్రాంతాలను తిరిగి, క్షేమంగా ఆస్ట్రేలియాకు చేరుకుని తమ ఘనకార్యాన్ని బయటపెట్టారు.

More Telugu News