: ఏపీ నుంచి రాజస్థాన్ వరకూ... 'అందాల బొమ్మ' బారిన వందలాది యువకులు!

ఆమె పేరు కుష్బూ శర్మ... అందంగా కనిపిస్తుంది. అదే వంద మందికిపైగా యువకులకు శాపమైంది. అందాన్ని ఎరగా వేసి, ధనవంతులను టార్గెట్ గా చేసుకుని వారిని బెదిరిస్తున్న యువతిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కుష్బూపై వందకు పైగా కేసులు నమోదవడం గమనార్హం. రాజస్థాన్ కు చెందిన ఈ యువతి, ఫేస్ బుక్ ద్వారా యువకులతో పరిచయాలు పెంచుకునేది. ఆపై వారిలో ధనవంతులైనవారిని టార్గెట్ చేసి కాఫీ కేఫ్ లు, రెస్టారెంట్లకు ఆహ్వానించేది. వారితో సన్నిహితంగా మెలగుతూ సెల్ఫీలు తీసుకునేది. ఆపై అసలు కథ మొదలు పెట్టి, డబ్బు ఇవ్వకుంటే, అత్యాచారయత్నం కేసు పెడతానని బెదిరించి అందినకాడికి డబ్బు గుంజేది. ఇదే క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది ఆమెకు పరిచయం కాగా, ఆపై కుష్బూ, అతని ఇంటికి వెళ్లి, రూ. 1.75 లక్షల నగదు, ఐఫోన్ తో పారిపోయింది. కొన్ని రోజుల తరువాత తిరిగి అతనికి ఫోన్ చేసి, తిరిగి మాయమాటలు చెబుతుండటంతో, సదరు న్యాయవాది పోలీసుల సాయంతో వలపన్ని కుష్బూను పట్టుకున్నాడు. ప్రస్తుతం ఆమె నేరాలపై మరింత లోతైన విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News