: రూ. 72,452 కోట్లు నష్టపోయిన టాప్-7 కంపెనీలు

గతవారంలో భారత స్టాక్ మార్కెట్లో టాప్ - 10 కంపెనీల్లో ఏడు కంపెనీలు గతవారంలో రూ. 72,452.27 కోట్ల మేరకు నష్టపోయాయి. ప్రభుత్వ రంగ ఒఎన్జీసీ అత్యధికంగా రూ. 17,367.65 కోట్లు నష్టపోగా, ఆ వెనుకే టీసీఎస్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియాలు నడిచాయి. రిలయన్స్ సంస్థ రూ. 14,724.35 కోట్లు నష్టపోగా, టీసీఎస్ మార్కెట్ కాప్ రూ. 12,709 కోట్లు దిగజారింది. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈక్విటీ పతనంతో, మొత్తం మార్కెట్ కాప్ రూ. 11,644.17 కోట్లు పడిపోయింది. ఇన్ఫోసిస్ రూ. 7,281.31 కోట్లు నష్టపోయింది. కోల్ ఇండియా రూ. 6,632 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 2,093 కోట్లు నష్టపోయాయి. ఇదే సమయంలో ఐటీసీ మార్కెట్ కాప్ రూ. 8,722 కోట్లు పెరగగా, హెచ్యూఎల్ రూ. 1,547 కోట్లు, హెచ్డీఎఫ్సీ రూ. 23.76 కోట్ల మేరకు మార్కెట్ కాప్ ను పెంచుకున్నాయి.

More Telugu News