: ఏపీలో తెగ తాగేస్తున్నారు.. ఏడు నెలల్లో రూ.8398 కోట్ల మద్యం అమ్మకాలు.. టాప్‌లో విశాఖ

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఎంతగా అంటే గత ఏడు నెలల్లో ఏకంగా 11.65 శాతం అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. మద్యం అమ్మకాల్లో విశాఖపట్టణం దూసుకుపోయింది. ఏడునెలల్లో జరిగిన మద్యం విక్రయాల్లో విశాఖ అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది ఈ విషయంలో తూర్పుగోదావరి జిల్లా ఆగ్రస్థానంలో నిలవగా ఈసారి ఆ స్థానాన్ని వైజాగ్ దక్కించుకుంది. ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు జరిగిన అమ్మకాల్లో విశాఖ జిల్లా రూ.929 కోట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాతి స్థానాన్ని రూ.875 కోట్లతో తూర్పు గోదావరి జిల్లా కైవసం చేసుకుంది. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా మద్యం అమ్మకాల్లో దూసుకుపోయాయి. రూ.850 కోట్లతో ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. రాజధాని ప్రాంతంలోనూ మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. విజయవాడ, మంగళగిరి, గుంటూరు నగరాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో మద్యం అమ్మకాలు పెరిగాయి. ఇక మద్యం విక్రయాల విషయంలో ఎప్పటి లాగే ఉత్తరాంధ్ర జిల్లా అయిన శ్రీకాకుళం, రాయలసీమ జిల్లాలు చివరి స్థానాల్లో నిలిచాయి. కడపలో రూ.408 కోట్లు, శ్రీకాకుళంలో రూ.413 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.

More Telugu News