: వికీలీక్స్ చెప్పింది నిజమే... క్లింటన్ ఫౌండేషన్ కు భారీ విరాళం

ఖతార్ ప్రభుత్వం నుంచి 10 లక్షల డాలర్ల విరాళాన్ని స్వీకరించినట్టు క్లింటన్ ఫౌండేషన్ ఎట్టకేలకు ఒప్పుకుంది. ఇంతకాలం, విరాళం స్వీకరించలేదంటూ బుకాయించిన ఈ ఫౌండేషన్ చివరకు ఒప్పుకోక తప్పలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న జాన్ పొడెస్టా ఈ మెయిల్స్ ను వికీలీక్స్ హ్యాక్ బయటపెట్టింది. వీటిలో ఈ విరాళాలకు సంబంధించిన ఈమెయిల్స్ ఉన్నాయి. అయితే, ఈ విషయాన్ని క్లింటన్ ఫౌండేషన్ మొదట్లో అంగీకరించలేదు. హిల్లరీ క్లింటన్ యూఎస్ విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడే ఈ విరాళాలు క్లింటన్ పౌండేషన్ కు చేరాయి. దీంతో, హిల్లరీ క్లింటన్ కు మరో కొత్త ఇబ్బంది వచ్చి పడినట్టైంది. విదేశాంగమంత్రిగా ఉంటూ ప్రైవేట్ సర్వర్ ద్వారా వేలాది ఈమెయిల్స్ ను పంపించారంటూ ఇప్పటికే హిల్లరీపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశం 8వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News